– పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పిలుపు
– నేడు విస్తృత స్థాయి సమావేశం
నవతెలంగాణ-పరిగి
బీఆర్‌ఎస్ శ్రేణులు కాంగ్రెస్‌లో చేరండని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పరిగి పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి ఆధ్వ ర్యంలో పరిగి నియోజకవర్గ బూత్ స్థాయి సమా వేశం సోమవారం పరిగి పట్టణ కేంద్రంలోని ఏబి ఎస్ ప్లాజాలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమా వేశానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించినట్టు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కంటే రెట్టింపు స్థాయిలో మెజారిటీ రావాలనే ఉద్దేశంతో సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 15 సీట్లు సాధించే దిశగా రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నట్టు తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు సాధించుకునేలా పోరాటం చేస్తున్నామని అన్నారు. గతంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఔటర్ రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులు తీసుకువచ్చామని అన్నారు. గత పదేండ్లుగా బీజేపీ, బీఆర్‌ఎస్‌లు చేసిన అభివృద్ధి శూన్యం అని విమర్శిం చారు. ఎంఎంటీఎస్‌ను వికారాబాద్ వరకు పొడిగి స్తామని, ఓఆర్‌ఆర్‌ఆర్ వంటి ప్రాజెక్టులను ప్రకట నాకే పరిమితం చేశారని అన్నారు. ప్రకటనల్లోనే అ భివృద్ధి చేసే పార్టీలకు ఎందుకు ఓటేయ్యాలని ప్ర శ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే రైతులకు ఉచిత విద్యుత్ అందించామని అన్నారు. దీని ద్వారా ఒక్కో రైతుకు లక్షల రూపాయల లాభం అయిందని అ న్నారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, రూ.10 లక్షల ఆరోగ్య బీమా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి పునర్నిర్మిస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ మనుగడ కష్టమని అన్నారు. కాబట్టి బీఆర్‌ఎస్ కార్యకర్తలు అందరూ కాంగ్రెస్‌లో చేరాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో ఎంపీ రం జిత్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఏబీఎస్ ప్లాజాలో నేడు ఉదయం 11 గంటలకు జరిగే స మావేశానికి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజ యవంతం చేయాలని కోరారు. ఈ సమా వేశంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.