
– ఈ నెల 9న కేటీఆర్ కు ఘనంగా స్వాగతం పలకాలి
నవతెలంగాణ-పెద్దవంగర: దేశానికే ఆదర్శంగా తెలంగాణ బీఆర్ఎస్ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవన్నారు. ఎన్నికల సమయంలో ఆ పార్టీ నాయకులు కనిపిస్తారని, ఆ తర్వాత అడ్రస్ ఉండదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే పరమావధి బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రతి గడపకు కేసీఆర్ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కార్యకర్తలు సూచించారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 9 న పాలకుర్తి నియోజకవర్గంలో రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తారని చెప్పారు. కేటీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, సోమేశ్వర రావు, సీనియర్ నాయకులు కేతిరెడ్డి సోమనర్సింహా రెడ్డి, ముత్తినేని శ్రీనివాస్, పాలకుర్తి యాదగిరిరావు, ఎంపీటీసీ సభ్యులు బానోత్ రవీందర్ నాయక్, రైతు సమన్వయ కమిటీ చైర్మన్ పాకనాటి సోమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.