నవతెలంగాణ – ఐనవోలు
మండలంలో తమ పరిపాలన చాతుర్యంతో అత్యుత్తమ సేవలు అందించి ప్రజల మన్ననలు పొందిన ప్రజా ప్రతినిధులులను ప్రతీ ఏటా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సన్మానించే కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లాలో ఉత్తమ పరిపాలనా అందించి తమ మండలాలను గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిన ఐనవోలు మండల ఎంపీపీ మార్నేని మధుమతి రవీందర్ రావు ఉత్తమ ఎంపీపీ గా, పున్నెలు సర్పంచ్ కత్తి దేవేందర్ ఉత్తమ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీద అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఐనవోలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఉత్తమ అవార్డుగ్రహీతలు ఎంపీపీ మధుమతి, సర్పంచ్ ల ఫోరం కత్తి దేవేందర్ లను ఐనవోలు భారాస మండల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి జడ్పి వైస్ ఛైర్మన్ శ్రీరాములు సొసైటీ వైస్ చైర్మన్ చందర్ రావ్ దర్గా సొసైటీ వైస్ చైర్మన్ మాదాసు బాబు భారాస ఐనవోలు మండల సమన్వయ కమిటీ సభ్యులు వివిధ గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీ లు మండల పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శి లు రైతు విభాగం నాయకులు ఆత్మ కమిటీ నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.