బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి 

BRS should avoid petty politics– హైడ్రాతో హైరాన్ అవుతున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి 
– హరీష్ రావు మళ్లీ డ్రామాలు షూరు చేసిండు
– కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు
– బిఆర్ఎస్  38 మంది ఎమ్మెల్యేలను లాకుంది  నిజం కాదా
– పార్టీ ఫిరాయింపుల గురించి బిఆర్ఎస్ మాట్లాడితే ప్రజలు నువ్వుతున్నారని ఆరోపణ
 నవతెలంగాణ – మిరుదొడ్డి / దుబ్బాక రూరల్ 
మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పుల్లో బిఆర్ఎస్ చేస్తే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతు ఆరు సంక్షేమ పథకాలు  కాంగ్రెస్ పార్టీ అమలు  చేస్తుందని  బిఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోకపోతే రానున్న రోజుల్లో బిఆర్ఎస్ కు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్  అధ్యక్షులు పాతూరి వెంకట స్వామి గౌడ్ అన్నారు. అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి  దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడారు. దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ హైడ్రాతో హై డ్రామా చేస్తుందని చెప్పటం సిగ్గుచేటని హైదరాబాదులోని దుర్గం చెరువులో ఎఫ్ టి ఎల్ పరిధిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకు హైడ్రా నోటీసులు ఇస్తే ప్రభాకర్ రెడ్డి  హైరానా పడుతున్నారని ఎద్దేవా చేశారు. కౌశిక్ రెడ్డి  నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని తెలిపారు. హరీష్ రావు  డ్రామాలు షూరు చేశారని చెప్పారు. 2014 నుండి 2018 వరకు 38 మంది శాసనసభ్యులను మీ పార్టీలోకి తీసుకుని వారిలో కొందరికి మంత్రి పదవి ఇచ్చింది మీరు కాదా. పార్టీ ఫిరాయింపుల గురించి బిఆర్ఎస్ మాట్లాడడం చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. హరీష్ రావు  మాట్లాడుతూ తెలంగాణ తెచ్చింది మేమే అని రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచింది మేమే అని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం నాలుగు కోట్ల ప్రజలు కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఏడు లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చింది బిఆర్ఎస్ పార్టీ కాదా అని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని తెలిపారు. ఇకనైనా బిఆర్ఎస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోకపోతే రానున్న రోజుల్లో వారికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అక్కపల్లి బాల్ నర్సాగౌడ్ , మండల ప్రధాన కార్యదర్శి కోనపురం బాలు యాదవ్, మాజీ సర్పంచ్ పెరిక మధు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మెర శ్రీధర్,బాల్తే వెంకటేశం, ఎల్లన్నగారి సురేందర్ రెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.