సంక్షేమ పథకాలు అమలుకు బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి

– ప్రచారంలో నల్లమోతు భాస్కర్‌రావు
నవతెలంగాణ-మిర్యాలగూడ
సంక్షేమపథకాలు అమలు కావాలంటే మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు పిలుపునిచ్చారు.శనివారం మండలంలోని వెంకటాద్రిపాలెం, జప్తి వీరప్పగూడెం, బళ్ళునాయక్‌తండా, అన్నారం తో పాటు వివిధ గ్రామాలలో ప్రగతియాత్ర ద్వారా ప్రచారం నిర్వహించారు.వెంకటాద్రిపాలెంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు గడుగోజు ఏడుకొండలు ఆధ్వర్యంలో 1000 కిలోలతో తయారు చేయించిన గజమాలను భాస్కర్‌రావుకు వేసి సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివద్ధి కోసం ప్రభుత్వం విశేష కషి చేస్తుందన్నారు.అన్ని గ్రామాలలో రోడ్లు,డ్రయినేజీ, వీధిదీపాలు ఏర్పాటు చేసి అన్ని రంగాలలో అభివద్ధి చేశానన్నారు.అన్ని వర్గాల సంక్షేమం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు.మరోసారి బీఆర్‌ఎస్‌కు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూకల సరళ హనుమంతురెడి,్డ రైతుబంధు జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్‌ మాజీ చైర్మెన్‌ చిట్టిబాబు నాయక్‌, మాజీ ఎంపీపీ పేలబ్రోలు తిరుపతమ్మ, సర్పంచ్‌ బారెడ్డి అశోక్‌రెడ్డి, శ్రీలత, ఎంపీటీసీలు ఆకుమర్తి గణేష్‌ పాల్గొన్నారు.