బీఆర్‌ఎస్‌ పార్టీకి అండగా ఉండాలి

– ఎమ్మెల్యే సండ్ర
నవతెలంగాణ-కల్లూరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ గ్రామాల స్వరూపాన్ని మార్చేస్తుందని, పని చేసే ప్రభుత్వానికి గ్రామ ప్రజలు అండగా నిలిచి కేసీఆర్‌ని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని పెద్దకోరుకొండి గ్రామంలో మాదిరాజు అన్నంరాజు ఇంటి వద్ద కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిపై, చేపట్టనున్న అభివృద్ధి పనుల విషయమై పలు విషయాలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాలేపు రామారావు, కనగాల వెంకటరావు, జడ్పీటీసీ కట్టా అజరు కుమార్‌, ఎంపీటీసీ చిట్టిబాబు, ఇస్సాకు, మచ్చ హనుమంతురావు, వెంకటేశ్వరరావు, తాళ్లూరి అచ్చయ్య, తాళ్లూరి శ్రీనివాసరావు తదితరులున్నారు.
వెంకటరత్నంను పరామర్శించిన సండ్ర
మండలంలోని అంబేద్కర్‌ నగర్‌కు చెందిన నాయకులు ఉబ్బన వెంకటరత్నం ఇటీవల అనారోగ్యానికి గురై ఖమ్మంలోని సంకల్ప హాస్పిటల్‌లో వైద్యం పొందుతుండగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య బుధవారం హాస్పిటల్‌కి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో మాట్లాడి తెలుసుకొని మెరుగైన వైద్యాన్ని అందించాలని కోరారు. అదేవిధంగా అనారోగ్యంతో వైద్యం పొందుతున్న కల్లూరుకు చెందిన పలువురిని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరామర్శించారు. అదేవిధంగా మండల పరిధిలోని పెద్ద కోరుకొండ గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వర్లు వెంకటరమణల కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని వధువు రుక్మిణిని ఎమ్మెల్యే సండ్ర, జడ్పిటిసి కట్టా అజరు కుమార్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు పాలెపు రామారావు, పెనుబల్లి మండలం నాయకులు కనగాల వెంకటరావు, గ్రామస్తులు తాళ్లూరు శ్రీనివాసరావు, తాళ్లూరి అచ్చయ్య, బండి రాము, మచ్చ హనుమంతరావు, పాల్గొన్ని వధువును ఆశీర్వదించారు.