బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి

– ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మెన్‌ గోలి శ్రీనివాస్‌ రెడ్డి
– పోలేపల్లి గేట్‌ సమీపంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం
నవతెలంగాణ-ఆమనగల్‌
బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌, రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మెన్‌ గోలి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పోలేపల్లి గేట్‌ సమీపంలో ఉన్న ఫంక్షన్‌ హాల్లో పోలేపల్లి, కొత్తకుంట తాండా, మంగళకుంట తాండా, చెన్నంపల్లి తదితర గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. దోనాదుల బ్రదర్స్‌ పీఏసీఎస్‌ వైస్‌ చైర్మెన్‌ సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు కుమార్‌ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, ఫుడ్‌ కమిషన్‌ చైర్మెన్‌ గోలి శ్రీనివాస్‌ రెడ్డి హాజరై మాట్లాడారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి జైపాల్‌ యాదవ్‌ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందాయని వారు గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామాలకు, తాండాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పొనుగోటి అర్జున్‌ రావు, నేనావత్‌ పత్య నాయక్‌, వైస్‌ ఎంపీపీ జక్కు అనంత్‌ రెడ్డి, చెన్నంపల్లి సర్పంచ్‌ పబ్బతి శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ చుక్కమ్మ లాలయ్య, ఏఎంసీ డైరెక్టర్లు సురమళ్ళ సుభాష్‌, రమేష్‌ నాయక్‌, నాయకులు వస్పుల సాయిలు, సయ్యద్‌ ఖలీల్‌, లాలయ్య గౌడ్‌, జహంగీర్‌, చలిచీమల సతీష్‌, కొమ్ము ప్రసాద్‌, జంతుక కిరణ్‌, వడ్డే వెంకటేష్‌, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.