దుబ్బాకలో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలి

– శిలాజీనగర్ బీఆర్ఎస్వై,బీఆర్ఎస్ కమిటీలు
నవతెలంగాణ దుబ్బాక రూరల్
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం శిలాజీనగర్ గ్రామంలో ఆదివారం మెదక్ ఎంపీ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు  బీఆర్ఎస్వై, బీఆర్ఎస్ కమిటీలు వేశారు ఈసందర్భంగా కమిటీ ఇన్చార్జులు మాట్లాడుతూ…. తెలంగాణ సర్కార్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలుగ్రామంలోని ప్రతి ఇంటికి చేరేవేయాలని అన్నారు.అలాగే రానున్న ఎన్నికల్లో మెదక్ ఎంపీ దుబ్బాక ఎమ్మెల్యే గా గెలుపు కోసం కార్యకర్తలు,నూతన కమిటీ అధ్యక్షులు  పని చేయాలన్నారు. ఇక దుబ్బాకలో తిరిగి గులాబీ జెండా ఎగరడమే లక్ష్యం గా పని చేస్తామని నూతన బీఆర్ఎస్వై,బీఆర్ఎస్ కమిటీలు అధ్యక్షులు అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మండల పార్టీ నాయకులు, కేపిఆర్ సేన మండల కమిటీ ఇన్చార్జులు అంబటి జగన్ గౌడ్, పర్స దేవరాజ్, అంబటి రఘువరన్, మార్కంటి నవీన్ తదితరులు ఉన్నారు.