బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా సమన్వయకర్తలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా సమన్వయకర్తలను నియమిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు నియోజకవర్గానికి అభిలాష్‌ రావు రంగినేని, మహబూబ్‌నగర్‌ పార్లమెంటు నియోజకవర్గానికి ఆశాప్రియ ముదిరాజ్‌ను ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కో ఆర్డినేటర్లుగా నియమించారు.