– స్థానిక వ్యక్తినీ ఇన్‌చార్జిగా నియమించి
– పార్టీని నిలపాలని అభిప్రాయం
– పార్టీలో ఉండేది ఎందరో.. ?
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో 7,8 ఏండ్లుగా చక్రం తిప్పిన టీఆర్‌ఎస్ పార్టీ ఆ తర్వాత బీఆర్ ఎస్‌గా మారి ఏక ఛత్రా ధిపతిగా నిలిచిన బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు అసలు ఉనికే ప్రశ్న్తార్థకంగా మా రిం ది. 8 నెలల క్రితం జరిగిన సార్వ త్రిక ఎన్నికల ముందు నుండి ప్రారం భమైన వలసలు నేటికీ ఆగడం లేద. ఎన్నికల కు ముందు మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, అయన భార్య హాఫిజ్‌పేట్ కార్పొరేటర్ పూజితలు మ రికొంత మంది ముఖ్యం నాయకులతో కలిసి కాంగ్రెస్ లో చేరి బీఆర్‌ఎస్ అభ్యర్థి పైనే ఎమ్మెల్యేగా పోటీచేశా డు. ఎన్నికల ప్రచారం జరుగుతుండగానే కొండాపూ ర్ కార్పొరేటర్ హమీద్ పటేల్, చందానగర్ డివిజన్‌కు చెందిన మాజీ కౌన్సిలర్ సునీతా ప్రభాకర్‌రెడ్డిలు కాం గ్రెస్‌లో చేరారు. అనంతరం జరిగిన ఎంపీ ఎన్నికల ప్పుడు సీనియర్ నాయకులు మిర్యాల రాఘవరావు, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మరికొంత మంది సీని యర్ నాయకులు కాంగ్రెస్‌లో చేరిపోయారు. అయి నప్పటికీ కాంగ్రెస్ గెలవలేకపోయింది. కానీ రాష్ట్రం లో మాత్రం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం మారగానే అందరి చూపు కాంగ్రెస్ వైపే మళ్లడంతో అనేక తర్జనభర్జనల అనంతరం బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గాంధీతో పాటు కార్పొరేట్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, రఘునాథ్ రెడ్డి, అన్వర్ షరీఫ్, గణేష్ ముదిరాజ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, రాజు యాదవ్ ఇలా అనేకమంది గాంధీతో పా టు కాంగ్రెస్‌లోకి మారారు. దీంతో దాదాపుగా శేరి లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఖాళీ అ యిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అ యితే ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడున్న నాయకులు, కార్యకర్తలు కొందరు మాత్రమే ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. అందులో ముఖ్యంగా కోమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, పురుషోత్తం యాదవ్, గచ్చిబౌలి మాజీ కార్పొరే టర్ కొమ్మిరిశెట్టి సాయిబాబా, రంగారెడ్డి జిల్లా ఉపా ధ్యక్షులుగా పనిచేసిన వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్, మిద్దెల మల్లారెడ్డి, రవీందర్ యాదవ్, గోపరాజు శ్రీనివాస్ రావు, బాబూమోహన్ మల్లేష్‌లతో పాటు వివేకానందనగర్ డివి జన్ డివిజన్ కార్పొరే టర్ రోజా రంగారా వుతో పాటు గచ్చి బౌలి డివిజన్‌కు చెందిన వార్డ్ మెంబర్లు గొర్రెంక సతీష్ ముదిరాజ్, దారుగుపల్లి నరేందర్, రాజు ముదిరాజ్‌లతో పాటు పలువురు మహిళలు ఉన్నారు.
జెండా నిలిపేదేవరు…..
ముఖ్యమైన పదవులు అనుభవించి పార్టీని వదిలి వెళ్ళిపోయిన తర్వాత పార్టీ జెండా మోసేది ఎవరనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి గతంలో శేరిలిం గంపల్లి ఇన్‌చార్జిగా పనిచేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డినే ఇన్‌చార్జిగా ఉంచినట్లు, తర్వాత పరిస్థితిని బట్టి శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని ఇన్‌చార్జిగా నియమించాలని కేటీఆర్ భావిస్తున్నట్లు కొందరు నాయకులు తెలిపారు.
గతంలో కూడా ఇలాంటి గడ్డు పరిస్థితి ఉండేది
టీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీగా మొదలైన కొత్తలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఖాజాగూడకు చెందిన కోమరగోని శంకర్ గౌడ్ ఇన్‌చార్జిగా పనిచే సారు. అప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడిన శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి 2009లో సార్వత్రిక ఎన్నికల్లో శంకర్ గౌడ్‌కే ఎమ్మెల్యే టికెట్ అని అప్పటికే ప్రక టిం చిన కేసీఆర్ అనంతరం జరిగిన పరిణామాల వల్ల టికెట్ పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించ డంతో అగ్రహించిన శంకర్ గౌడ్ పార్టీనీ వీడాడు. అప్పటి వరకు శేరిలింగంపల్లిలో రేపరేపలాడిన గులాబీ జెం డా వాడిపోయే పరిస్థితిలో గోపినగర్‌కు చెందిన స్వ ర్గీయ శంకర్ గౌడ్ అత్తికొద్ది మందితో జెండాను నిల బెట్టాడు. అనంతరం జరిగిన పరిణామాల్లో పార్టీ మ ళ్ళీ పుంజుకుంది. అనారోగ్య కారణాలతో కొండకల్ శంకర్‌గౌడ్ మరణించినప్పటికీ పార్టీకి ఆలోటు ఏర్ప డలేదు. అన్ని పార్టీల వారితో టీఆర్‌ఎస్ నిండిపో యింది. ఇప్పుడు మళ్ళీ అందరూ వెళ్లిపోవడంతో ఉద్య మ కారులు మాత్రమే మిగిలారు. అయితే ఇప్పుడున్న గడ్డు పరిస్థితిలో పార్టీనీ నడిపేది ఎవరనేది ప్రశ్న్తార్థకంగా మారింది.