బూటకపు హామీలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయంలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతాంగం ఎదుర్కుంటున్న సమస్యలపై బీఆర్ఎస్ రైతు ఐక్యవేదికను ఏర్పాటు చేసి ఉద్యమబాట పట్టిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, రైతు భరోసా ఎగ్గొట్టి ప్రభుత్వం రైతుల ఉసురు తీసుకుంటోoదన్నారు. ఆరు గ్యారంటీలను చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమయిందన్నారు. కాంగ్రెస్ 300 రోజుల పాలనలో ఇప్పటికీ 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఎకరానికి రూ.పదిహేను వేల రైతు భరోసా, పెన్షన్ల పెంపు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం వంటి హామీలను బుట్టదాఖలు చేశారన్నారు. రైతు భరోసా ఇవ్వకుండా కాబినెట్ సబ్ కమిటి పేరిట కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.. ఈనెల 24న రాం లీలా మైదానంలో ప్రభుత్వ వైఫల్యాలపై కేటీఆర్ శంఖారావం పూరించనున్నారని, ఈ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు. సమావేశంలో రైతు సమన్వయ అధ్యక్షులు రోకండ్ల రమేష్, పట్టణ అధ్యక్షులు అజయ్, విజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, గండ్రత్ రమేష్, కుమ్రా రాజు, వేణుగోపాల్ యాదవ్, పరమేశ్వర్, నవతే శ్రీనివాస్, సోనేరావ్, ఐయూబ్ పాల్గొన్నారు.