– కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
– కాంగ్రెస్‌లో చేరిన ఆయా పార్టీల నాయకులు
– జాతీయ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్
నవతెలంగాణ-షాబాద్
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం లూటీ చేసి, బ్రష్టు పట్టించారని జాతీయ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ అన్నారు. సోమవారం కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ అభ్యర్థి పామెన భీంభరత్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శులు రాంరెడ్డి, పీసరి సురేందర్ రెడ్డి, జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంతోష్‌తో కలిసి షాబాద్ మండలంలోని ఆయా గ్రామాల్లో కలిసి, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం అధికారం అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా అనేక పథకాల్లో దోపిడీలు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేలకోట్ల రూపాయలు లూటీ చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాలతో తెలంగాణ ప్రజలు విసుగు చెంది, ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి ఎంతో దోహద పడిందన్నారు.
కాంగ్రెస్‌లో భారీగా చేరికలు
మాచినపల్లి, అంతిరెడ్డిగూడ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌కు చెందిన నేరెట్ల మహేందర్‌గౌడ్‌తో పాటు సుమారు 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే షాబాద్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారులు గౌసియా బేగం, లక్ష్మీలు జాతీయ నాయకుల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని, పార్టీలో చేరారు. పార్టీ చేరిన వారిలో సత్యనారాయణ రెడ్డి, వెంకటయ్య, పర్వ తాలు, అంజయ్య, రాజు, శ్రీనివాస్ గౌడ్, సత్యం, చందన్‌వెళ్లి గ్రామానికి చెందిన భూ నిర్వాసితుల సంఘం నాయకులు శోభావేమారెడ్డిలు కాంగ్రెస్ తీర్థం పుచ్చు కున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్, నాయకులు చేవెళ్ల స్వామి, కాజ మియా, రషీద్ పటేల్, నరేందర్ రెడ్డి, పెంటారెడ్డి, తమ్మలి, రవీందర్, జనార్ధన్‌రెడ్డి, ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, మల్లేష్, అశోక్, పొన్న జయమ్మ, వెంకట్‌రెడ్డి, నాయకులు రాహుల్ గుప్తా, యాదయ్య, చెన్నయ్య, రవి నాయక్, నర్సింలు గౌడ్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.