– కల్వకుర్తి బీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్
నవతెలంగాణ-ఆమనగల్
ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్‌దే గెలుపు ఖాయమని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కడ్తాల్ మండలంలోని గానుగుమర్ల గ్రామ పంచాయతీకి చెందిన జర్పుల లక్పతి నాయక్ ను బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడిగా, కడ్తాల్ మండల ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యునిగా నియమిస్తూ లక్పతి నాయక్‌కు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
బీఆర్‌ఎస్ లో చేరికలు
కడ్తాల్ మండల కేంద్రంలో శనివారం జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ సమక్షంలో కడ్తాల కేంద్రానికి చెందిన వివిధ యువజన సంఘాల, పార్టీల నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. జడ్పీటీసీ స్థానిక నాయకులతో కలిసి వారికి గులాబి కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా దశరథ్ నాయక్ మాట్లాడుతూ జైపాల్ యాదవ్ ను మరోసారి గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా పంపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా, సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు లచ్ఛిరామ్ నాయక్, డైరెక్టర్ లాయఖ్ అలి, మండల ఉపాధ్యక్షులు లక్పతి నాయక్, ఉపసర్పంచ్ శారదా పాండు నాయక్, కంబాలపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు.
-జైపాల్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారం
జైపాల్ యాదవ్‌ను మరోసారి గెలిపించాలని కోరుతూ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి కడ్తాల్ పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తున్న కేసీఆర్ కు అందరు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
-బీఆర్‌ఎస్ నాయకుల ఇంటింటికీ ప్రచారం
ఆమనగల్ పట్టణంలో బీఆర్‌ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కల్వకుర్తి అసెంబ్లీ బీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్‌ను మరోసారి గెలిపించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మెన్ తోటగిరి యాదవ్, బీఆర్‌ఎస్ అధ్యక్షులు నేనావత్ పత్యనాయక్, ఎంపీటీసీ దోనాదుల కుమార్, కౌన్సిలర్ కమటం రాధమ్మ వెంకటయ్య, నాయకులు సయ్యద్ ఖలీల్, జహంగీర్, చలిచీమల సతీష్, శివకుమార్, ప్రసాద్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.