నవతెలంగాణ- పెద్దవంగర
బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడవద్దని, ఎర్రబెల్లి దయాకర్ రావు అండగా ఉంటారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తున్నామని, ఫలితాలు, జయాపజయాలు ఎలా ఉన్నా ఎళ్లప్పుడూ ఎర్రబెల్లి ప్రజల పక్షానే నిలబడి ఉంటారని చెప్పారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులకు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎర్రబెల్లి ఎంతో కృషి చేశాడని కొనియాడారు. అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యల పట్ల రాజీలేని పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, మండల రైతు కోఆర్డినేటర్ పాకనాటి సోమారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి యాదగిరి రావు, ఎఫ్ఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ ముత్తినేని శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు కనుకుంట్ల వెంకన్న, జ్ఞానేశ్వర చారి, కొండపల్లి విజయ్ పాల్ రెడ్డి, పాకనాటి సునీల్ రెడ్డి, మండల పరిషత్ కోఆప్షన్ నెంబర్ ఎండీ ముజీబుద్దీన్, ఎంపీటీసీ మెట్టు సౌజన్య నగేష్, మల్లికార్జున చారి, పసులేటి వెంకట్రామయ్య, ఓరుగంటి సోమ నర్సయ్య, మైలపాక యాకయ్య, భూక్యా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.