కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు

నవతెలంగాణ- మోర్తాడ్
మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్తలు ఫ్రెండ్స్ యూత్ సభ్యులు 70 మంది కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో సునీల్ రెడ్డి సమక్షంలో 70 మంది యువకులు పలు యువజన సంఘం సభ్యులు పార్టీలో చేరారు. నిధులు నియామకాలతో అధికారి చేపట్టిన బిఆర్ఎస్ ప్రభుత్వం యువతను పక్కదారి పట్టించే విధంగా పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఉపాధి లభిస్తుందని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు,  మురళి, రాజశేఖర్, సురేష్ ప్రజలు పాల్గొన్నారు.