
నవతెలంగాణ – తొగుట
ఈనెల 13న దౌల్తాబాద్ లో జరిగే బీఆర్ఎస్ యువ భేరి సభను విజయవంతం చేయాలని రాష్ట్ర యువజన నాయకులు తీపిరెడ్డి మహేష్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ యువ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ ఎంపీ ఎన్నికల్లో మాజీ కలెక్టర్ వెంకట్రామి రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈనెల 13న జరిగే యువగర్జన సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నాలు గు నెలల కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలు ప్రజలు అన్యాయానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను, మహిళలను, యువకులను అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి వారికి బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్, బీఆర్ఎస్వి అధ్యక్షులు అరుణ్ కుమార్, నంట పరమేశ్వర్ రెడ్డి, నాయకులు బండారు రమేష్ గౌడ్, అనిల్ కుమార్, సురేష్ గౌడ్, స్వామి, రాజశేఖర్, బోయిని బాలరాజు, నేవూరి కరుణాకర్ రెడ్డి, మహేష్, బాలరాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు.