అంబేడ్కర్ ఆశయాన్ని అవమానపరించింది బీఆర్ఎస్సే..

– బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ ఆరోపణ
– ఎమ్మెల్యే కవ్వంపల్లిపై బీఆర్ఎస్ ఆరోపణల ఖండన 
నవతెలంగాణ – బెజ్జంకి 
ఏక చక్రాధిపత్యం,నియంతృత్వ దోరణి అవలభిస్తూ అంబేడ్కర్ ఆశయాన్ని అవమానపరిచింది మండల బీఆర్ఎస్ పార్టీయేనని బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ మంగళవారం ఆరోపించారు.  ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,మండల కాంగ్రేస్ శ్రేణులపై మండల బీఆర్ఎస్ నాయకుడు చేసిన ఆరోపణలను లింగాల శ్రీనివాస్ ఖండించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో  శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని గుగ్గీల్ల,లక్ష్మీపూర్, గూడెం గ్రామాల్లో నెలకొల్పిన అంబేడ్కర్ విగ్రహాలావిష్కరణలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, మండల బీఆర్ఎస్ నాయకులు ఏక చక్రాధిపత్యం చలాయించి ప్రతి పక్ష నాయకులనే విస్మరించిన చరిత్ర ఉందని గుర్తు చేశారు.అందరి వాడైనా అంబేడ్కరుడిని కొందరివాడుగా మార్చిన ఘనత  బీఆర్ఎస్ నాయకులదని మర్చిపోయారని విమర్శించారు.దళత సామాజిక వర్గానికి చెందిన మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దళితులంటే  వివక్ష చూపే అగ్రవర్ణాలను అక్కున చేర్చుకుని అంబేడ్కరుడి పేరుతో రాజకీయాలు చేశారని అసహనం వ్యక్తం చేశారు.తిమ్మాయిపల్లిలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోవాడాన్ని జీర్ణించుకోలేక ఎమ్మెల్యే కవ్వంపల్లిపై బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుందని..అంబేడ్కర్ పై అపారమైన గౌరవం ఉండడంతోనే నియోజకవర్గంలోని అల్గునూర్ చౌరస్తాతో పాటు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్ట్ చౌరస్తా వద్ద నిర్వహించిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని నివాళులర్పించిన విషయాన్ని బీఆర్ఎస్ తెలుసుకోకపోవడం అవివేకమన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే,కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.