‘ప్రజలందరినీ ఆదుకుంటున్నది బీఆర్‌ఎస్సే’

నవతెలంగాణ-తాండూరు
ప్రజలందరినీ ఆదుకుంటున్నది బీఆర్‌ఎస్సే అని రాష్ట్రం లో అమలవుతున్న సంక్షేమ పథకాలతో దేశ ప్రజల దృష్టి సీఎం కేసీఆర్‌ వైపు మళ్లిందని ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరులోని ఆయన నివాసంలో అంతారంకు చెందిన దాదాపు 100 మందికి పైగా ఎమ్మెల్యే సమ క్షంలో సర్పంచ్‌ రాములు, యువనాయకులు చల్లా శ్రీను ఆధ్వర్యంలో బీఆర్‌ ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే వారందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ..సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసే ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.