– గ్రంథాలయ మాజీ చైర్మన్ శాసం రామకష్ణ
నవ తెలంగాణ – కోస్గి
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం కాంగ్రెస్ కు చెంప పెట్టు లాంటిదని మాజీ గ్రంథాలయ చైర్మన్ శాసం రామకష్ణ అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్‌రెడ్డి గెలుపునకు సహకరించిన ఎంపీటీసీలు ,జెడ్పీటీసీలు, కౌన్సి లర్లకు కతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో 200 ఓట్లు మెజారిటీతో ఎమ్మెల్సీని గెలిపించుకుంటానని గతంలో ప్రక టన ఆచరణలో సాధ్యం కాలేదన్నారు. రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఫలి తాల్లో 9 నుంచి 10 స్థానాలు బీ ఆర్ ఎస్ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆ పార్టీని ప్రజలు చీకొడుతున్నారన్నారు . అమరవీరుల స్థూపం దగ్గర కంచ ఏర్పాటు సరైంది కాద న్నారు. అమరవీరుల స్తూపం తెలంగాణ ప్రజలని కాంగ్రెస్ గుర్తుంచు కోవాలన్నారు. తెలంగాణ ప్రజలు ఏమి కోరుకుంటారో తెలుసుకొని ప్రభుత్వం ప్రజా సమస్యలను తీర్చాలన్నారు. రేవంత్ రెడ్డి గతంలో సోని యా గాంధీని తెలంగాణ బలిదేవతన్నారు. ఇప్పుడు తెలంగాణ దేవత అని ఏ విధంగా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ వల్లనే 1200 మంది విద్యార్థులు చనిపోయారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జనార్దన్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు వెంకట్ నరసింహులు, డీకే రాములు , సాయప్ప, పోచప్ప, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.