కవిత పుట్టినరోజు సందర్భంగా పండ్ల పంపిణీ చేసిన బీఆర్ఎస్వీ నాయకులు

నవతెలంగాణ – కంటేశ్వర్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  పుట్టిన రోజును పురస్కరించుకుని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు డా. శ్రీనివాస్ గౌడ్ అద్వర్యం లో నిజామాబాద్ నగరం లో రోగుల కు పండ్లు పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని ఇలాంటి నాయకురాలు ప్రజాసేవలో ఉండాలని అలాగే ఇలాంటి జన్మదిన వేడుకలను మరిన్ని జరుపుకోవాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి నగర ప్రధాన కార్యదర్శి మధుకర్ రెడ్డి నాయకులు గణేష్ నాయక్ మోసిన్ తబరేజ్ సాయి ముత్తెన్న ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.