ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అజిత్ పవార్ వర్గానికి చెందిన నాయకుడు సచిన్ కుర్మీ శుక్రవారం రాత్రి ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో హత్యకు గురయ్యారు. ఈ సంఘటన అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో జరిగింది. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన సచిన్‌ను సమీపంలోని జెజె ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ పరీక్షించిన తర్వాత కుర్మీ చనిపోయినట్లు ప్రకటించారు. పోలీసులు మతదేహాన్ని తమ కస్టడీలోకి తీసుకుని పోస్టుమార్టం కోసం పంపించామని ముంబై పోలీసులు తెలిపారు. సచిన్ కుర్మీపై ఎవరు దాడి చేశారన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్‌సిపి (అజిత్ పవార్ వర్గం) నాయకుడు సచిన్ కుర్మీని గత రాత్రి ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో హత్య చేశారని తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నామని అన్నారు. ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో కుర్మీపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.