నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల బీ.ఎస్.సీ. (వ్యవసాయం), 4 వ సంవత్సరం చదువుతున్న 46 విద్యార్థినిలు గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలం లోని వివిధ గ్రామాలలోకి వెళ్లినట్లు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన విద్యార్థులతో కలిసి మాట్లాడారు. ఏరువాక కేంద్రం యాదాద్రి భువనగిరి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని, విద్యార్థినిలు 4 నెలల పాటు గ్రామీణ ప్రాంతాలలో ఉండి వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ విషయాలపైన అవగాహన చేసుకుని. ఏరువాక కేంద్రం నుండి ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేస్తారు. 3 సంవత్సరాల కాళాశాల చదువు తరువాత ఇక రైతులకు నేరుగా సేవ చేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని విద్యార్థినిలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏరువాక కేంద్రం, భువనగిరి ప్రధాన శాస్త్రవేత్త, బి. అనిల్ కుమార్, శాస్త్రవేత్త కె మమత పర్యవేక్షణలో జరుగుతున్నది. వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్ నుండి అసోసియేట్ ప్రొఫెసర్, నిర్మల, ప్రిన్సిపాల్ నరేంద్ర రెడ్డి పర్యవేక్షణలో జరుగుతున్నదని, విద్యార్థుల వెంబడి అభ్యుదయ రైతు కంచి మల్లయ్య ఉన్నారు. భువనగిరి మండలంలోని అనాజిపురం, బొల్లెపల్లి, గౌస్ నగర్, తాజ్పూర్, కునూరు, వీరవెల్లి, వీరవెళ్లి, మోటకొండూరు, ముత్తిరెడ్డిగూడెం, నాగిరెడ్డిపల్లి ఒక్కొక గ్రామానికి ఐదుగురు చొప్పున గ్రామీణ పనులు నేర్చుకోనున్నట్లు తెలిపారు.