బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో మైలురాయి

BSNL is another milestone– 65వేల టవర్లు 4జిగా అప్‌గ్రేడ్‌
న్యూఢిల్లీ : చౌక ఛార్జీలతో ప్రయివేటు టెల్కోల ఖాతాదారులను ఆకర్షిస్తున్న ప్రభుత్వ రంగ టెల్కో బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో మైలురాయిని సాధించింది. దేశ వ్యాప్తంగా 65,000 టవర్లను 4జీ మొబైల్‌ టవర్స్‌గా ఆధునీకరించింది. దీంతో 2100 ఎంహెచ్‌జడ్‌, 700 ఎంహెచ్‌జడ్‌ బాండ్‌ స్పెక్ట్రమ్‌ల సామర్థ్యాన్ని ఉపయో గించుకోనుంది. తద్వారా తన వినియోగదారులకు ఇంటిలోపల కూడా మెరుగై న నెట్‌వర్క్‌ను అందించనుంది. వాణిజ్యపరంగా ఇది ఆ సంస్థకు మరింత బలాన్ని చేకూర్చనుంది. దేశంలోనే నాలుగో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఏడాది మధ్య నాటికి 5జీ వాణిజ్య సర్వీసుల్లోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది ఎన్‌ఎఎఎస్‌ విధానంలో ఢిల్లీలో 5జీ సర్వీసులను పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించింది.