
కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో బహుజన్ సమాజ్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మాలోత్ హరిలాల్ నాయక్ గత రెండు సంవత్సరాలుగా బీటీ రోడ్డు వేయడం లేదని దానిని వెంటనే పూర్తి చేయాలని సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధారి మండలం పోతంగల్ గ్రామం నుండి మేడిపల్లి తాండ వరకు 2 కిలోమీటర్ల 700 మీటర్లు దూరం, (గాంధారి నుండి బాన్సువాడ వెళ్లే దారి) ఈ రోడ్డు గత రెండు సంవత్సరాల నుంచి బీటీ రోడ్డు ను పూర్తిచేయడం లేదని, కంకర రోడ్డు ఉండడం వల్ల ప్రయాణికుల బైకులు, కార్లు అన్ని రకాల వాహనాల యొక్క టైర్లు పంచర్లు అవుతున్నాయన్నారు. పెద్ద వాహనాలు నడిచినప్పుడు టైర్ల కింద ఉండే కంకర రాళ్లు పక్కన పోయే బైక్ వాళ్లకు తాకుతున్నాయనీ, వాహనాలు నడిచినప్పుడు,విపరీతమైన దుమ్ము ధూళి లేస్తుందన్నారు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అతి తొందర్లో బీటీ రోడ్డు వేయించి ప్రయాణికులకు మేలు చేయాలని అడిషనల్ కలెక్టర్ వి. విట్టర్ కు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందన్నారు.