బిఎస్పీ కి చెందిన పలువురు ప్రజా పంథా(మాస్ లైన్) లో చేరారు.నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలం,పేరాయిగూడెం పంచాయితీ మోడల్ కాలనీకి చెందిన ఆరు కుటుంబాలు బీఎస్పీ ని వీడి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా లో చేరినట్లు ఆ పార్టీ జిల్లా నాయకులు గోకినపల్లి ప్రభాకర్ సోమవారం ప్రకటించారు. బీఎస్పీ మండల అధ్యక్ష కార్యదర్శులు పొదిలి వెంకటేశు, కేశపోయిన శివ ల నాయకత్వం లో వై సీతారాములు,నాయని నాని, తెప్పల రాఘవ, బత్తిన గోపి ఆరు కుటుంబాలు చేరినట్లు వివరించారు.ఈ సందర్భంగా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి మాట్లాడుతూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పేద ప్రజల కోసం నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తుందని అంతిమంగా ఈ దేశంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం చేయడానికి కృషి చేస్తుందని, ఈ కృషిలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని కోరారు. ముందుగా పొదిలి వెంకటేష్ కు పార్టీ జిల్లా కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పాల్వంచ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అమర్లపుడి రాము, జిల్లా నాయకులు కంగాల కల్లయ్య, మండల కార్యదర్శి వాసం బుచ్చి రాజు తదితరులు పాల్గొన్నారు.