బడుగు, బలహీన వర్గాలకు అండగా బీఎస్పీ

– బీఎస్పీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్‌ దాసరి ఉష
నవతెలంగాణ – పెద్దపల్లి టౌన్‌
బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే ఏకైక పార్టీ బీఎస్పీ అని పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్‌ దాసరి ఉష అన్నారు.గురువారం పెద్దపల్లి మండలం మూలసాల గ్రామానికి చెందిన నరహరి, సముద్రాల ఉదరు, పుల్లూరి అవినాష్‌, పులిపాక లత, కాంపెల్లి కమల, కనుకుంట్ల కరుణ, సముద్రాల అలేఖ్య, అడ్లురి ఇందు, పులిపాక నేహ వివిధ పార్టీ నాయకులు, యువకులు, మహిళలు 200 మందికి పైగా బహుజన్‌ సమాజ్‌ పార్టీలోకి పార్టీ బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ దాసరి ఉష కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఉష మాట్లాడుతూ మూలసాల గ్రామంలో నరహరి, వరలక్ష్మి వారి సొంత ఖర్చులతో బీఎస్పీ జెండా గద్దెను నిర్మించడం చాలా సంతోషకరం అన్నారు. నియోజకవర్గంలో ఏ మండలంలో చూసినా ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్ల సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పి అసెంబ్లీ మహిళా కన్వీనర్‌ ఆముదాల అరుణ, కాల్వ శ్రీరాంపూర్‌ మండల అధ్యక్షులు కుమ్మరికుంట రవికుమార్‌, కాల్వ శ్రీరాంపూర్‌ మండల కోశాధికారి కోర్రె కిరణ్‌, రాము, దిడ్డి సురేష్‌, కంటాల నరేష్‌ పాల్గొన్నారు.