విగ్రహావిష్కరణకు తరలిన బీఎస్పీ, స్వేరోస్ నాయకులు

నవతెలంగాణ – బెజ్జంకి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో నెలకొల్పిన డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు బీఎస్పీ రాష్ట్రాధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ ముఖ్య అతిథిగా హజరవుతున్న దృష్ట్యా మండలంలోని బీఎస్పీ, స్వేరోస్ నాయకులు గురువారం తరలివెళ్లారు.కరీంనగర్ జిల్లాధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్,కార్యవర్గ సభ్యులు పెద్దోల్ల శ్రీనివాస్ యాదవ్, మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు బోనగిరి ప్రభాకర్, స్వేరోస్ సిద్దిపేట జిల్లాధ్యక్షుడు బొర్ర సురేశ్ కుమార్, నియోజవర్గ, మండల బీఎస్పీ నాయకులు తరలివెళ్లారు.