నవతెలంగాణ- కమ్మర్ పల్లి: మండలంలోని బషీరాబాద్ గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణం పనులను శుక్రవారం ప్రారంభించారు. గ్రామంలోని నాయిక వాడ నుండి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులను చేపట్టారు. ఉదయం ప్రారంభమైన పనులను సర్పంచ్ సక్కరం అశోక్ సందర్శించి పరిశీలించారు. పదికాలాలపాటు మన్నేల నాణ్యతతో కూడిన పనులు చేయాలని ఈ సందర్భంగా బీటీ రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్ కు సూచించారు. నాణ్యత కూడిన పనులు చేయడం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసి బీటీ రోడ్డు వేయించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి గ్రామ పంచాయతీ పాలక వర్గం, గ్రామస్తుల తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. వారికీ ఎల్లవేళలో రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కస్తూరి విక్రమ్, నెల్ల రమేష్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బైకాని మహేష్, పార్వతి రాజు, ఎల్. దేవేందర్, లింబాన్న, తదితరులు పాల్గొన్నారు.