లింకు రోడ్లపై బీటీ రోడ్డు వేయాలి

– ప్రమాదపుటంచులో ప్రయాణికులు
– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నాగిల్ల శ్యామ్‌ సుందర్‌
నవతెలంగాణ-మంచాల
గ్రామానికి మరొక గ్రామానికి మధ్య ఉన్న లింకు రోడ్లపై బీటీ రోడ్డు వేయాలని సీపీఐ(ఎం) మండల కార్య దర్శి నాగిల్ల శ్యామ్‌సుందర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చే శా రు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన మాట్లా డు తూ..నోముల నుండి ఆగపల్లి, బుగ్గతండ నుండి ఎల్లమ్మ తండా, మంచాల నుండి తాళ్ళపల్లి గూడ, జపాల నుండి గున్‌గల్‌గల లింకు రోడ్లు అన్ని కంకర రోడ్లు ఉన్నాయని కొన్నేండ్లుగా అట్టి రోడ్లపై బైక్‌లు, కార్లు, లారీలు, ట్రాక్టర్లు, టిప్పర్‌లు వెళ్ళడం తో కంకర, మట్టి అంతకొట్టుకు పోయి గుంతలమయంగా మారాయని, చినుకు పడిందంటే రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయ న్నారు. ఈ రోడ్లపై ప్రయాణం చేసే వాహనదారులు ప్రా ణాలు అర చేతుల్లో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారన్నా రు. రాత్రిపూట వెళ్ళాలంటే నరక ప్రయమే అన్నారు. కాబ ట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామానికి మరొక గ్రామానికి మధ్య ఉన్న లింకు రోడ్లపై బీటీ రోడ్లు వేయా లని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.