
మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం ప్రారంభమయ్యాయి.మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామంలో ఎస్సీ కాలనీ నుండి పెద్దమ్మ ఆలయం వరకు బిటి రోడ్డు పనులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బీటీ రోడ్డు పనులను పరిశీలించిన ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్ మాట్లాడుతూ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ప్రశాంత్ రెడ్డి ఇలాకాలో ఎన్నికల సమయంలోనూ అభివృద్ధి పనులు ఆగడం లేదన్నారు.మంచి నాయకుడు ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం ఆలోచిస్తుంటాడని అటువంటి నాయకుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి అని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ఒక్కసారి ఆలోచించి గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూసి, ప్రశాంత్ రెడ్డి ని గెలిపించుకోవడం ద్వారా గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించుకుందామన్నారు. అడిగిన వెంటనే నిధుల మంజూరు చేసి కాలనీవాసుల రహదారి సమస్యను పరిష్కరించిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.