హెచ్‌ఎంల సస్పెన్షన్‌ ఎత్తేయాలి : బీటీఏ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రధానోపాధ్యాయుల (హెచ్‌ఎం)పై ఉన్న సస్పెన్షన్‌ను ప్రభుత్వం వెంటనే ఎత్తేయాలని బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ (బీటీఏ) రాష్ట్ర అధ్యక్షులు కల్పదర్శి చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. స్పౌజ్‌ పాయింట్లను వారు దుర్వినియోగం చేశారనే నెపంతో సస్పెండ్‌ చేయడం సరైంది కాదని తెలిపారు. జీహెచ్‌ఎంలకు స్పౌజ్‌కు సంబంధించిన నిబంధనలను సరిచేయాలని కోరారు. వారికి సాధారణ బదిలీల్లో జిల్లా క్యాడర్‌ కాకుండా మల్టీ జోన్‌ వారీగా బదిలీలు పదోన్నతులు చేయబడ్డాయని పేర్కొన్నారు. అలాంటప్పుడు వారికి జిల్లాగాని లేదా జోన్‌ గాని పరిగణనలోకి రావాలనీ, స్కూల్‌ పాయింట్ల పరిధిలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేసి వారి సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తేసి నియమ నిబంధనలను సరిచేయాలని కోరారు.