రాష్ట్రంలో ‘బు అబ్దుల్లా’ కంపెనీ పెట్టుబడులు

– టీ హబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దుబాయికి చెందిన ప్రముఖ సంస్థ ‘బు అబ్దుల్లా’ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లోని టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఇరువురు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ‘బు అబ్దుల్లా’ అంగీకారం తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెట్టి రికార్డులను సొంతం చేసుకున్న ఈ సంస్థ టీ కన్సల్ట్‌తో కలిసి పని చేయడానికి ముందుకు రావడం పట్ల సంస్థ చైర్మెన్‌ సందీప్‌ కుమార్‌ మక్తాలా సంతోషం వ్యక్తం చేశారు. వ్యాపార విస్తరణ, సహకారం, అభివృద్ధికి ఈ ఒప్పందం వారధిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.