రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బబుల్‌గమ్’. మానస చౌదరి హీరోయిన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీ బుకింగ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించింది. హీరోలు అడివి శేష్, విశ్వక్ షేన్, సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ నందిని రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ,’రవికాంత్ పేరెపు అద్భుతంగా ఈ సినిమాని తీశారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటాయి. ఈ చిత్రంలో మనందరికీ ఉండే ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఎమోషన్స్‌ని అందరూ ఎంజారు చేస్తారు’ అని తెలిపారు. ‘మహేశ్వరి మూవీస్ నిర్మాణంలో పని చేయడం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రజెంట్ చేయడం సంతోషంగా ఉంది. శ్రీచరణ్‌తో కలిసి పని చేయడం ఇది మూడోసారి. రోషన్, మానస నన్ను చాలా బలంగా నమ్మారు. అందరూ థియేటర్స్‌లో సినిమా చూడాలి’ అని దర్శకుడు రవికాంత్ పేరేపు అన్నారు. హీరోయిన్ మానస మాట్లాడుతూ, ‘నా తొలి చిత్రానికే ఇంత ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరకడం ఆనందంగా వుంది. ‘బబుల్‌గమ్’లోని ఆది, జాన్వి అందరికీ కనెక్ట్ అవుతారు’ అని తెలిపారు. ‘రోషన్‌ని ఏడాది క్రితం కలిశాను. అప్పుడు చాలా అమాయక కుర్రాడిలా కనిపించాడు. కానీ ఈ చిత్ర టీజర్, ట్రైలర్‌లో తన విశ్వరూపం కనిపించింది. ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడు’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు.ఈ వేడుకలో రచయిత అబ్బూరి రవి, దర్శకులు విమల్ కష్ణ, శ్రీకాంత్ నాగోతి, జ్ఞానసాగర్ ద్వారాక, ఆదిత్య మండలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.