
గీత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు మంగళవారం చేర్యాల పట్టణ శివారులోని రేణుకా ఎల్లమ్మ దేవాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ ఎన్నికలలో సహకార సంఘం అధ్యక్షుడిగా అంబాల బుచ్చి రాములు, ఉపాధ్యక్షులుగా బుడిగె వెంకటేష్, కార్యదర్శిగా చెక్కిల్ల కనకయ్య, కోశాధికారిగా గుడాల రాజు, డైరెక్టర్లుగా బొంగోని భాస్కర్, అంబటి భూలక్ష్మి, పచ్చిమడ్ల పద్మ, అంబాల నాగేశ్వర్, పచ్చిమడ్ల వెంకటయ్య ఎన్నికయ్యారు.