– బీసీ కమిషన్‌కు విన్నపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘బుడబుక్కల’గా పిలవబడుతున్న తమ కులం పేరును ఆరె క్షత్రియజోషి,శివక్షత్రియ జోషిగా మార్చాలని ఆ కులానికి చెందిన ప్రతినిధులు రాష్ట్ర బీసీ కమిషన్‌ను కోరాఉ. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని మేర, కుమ్మరి, రజకకుల సంఘాల ప్రతినిధులతో కలిసి వారు కమిషన్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. మేర కులాన్ని (చిప్పోలు) గా మార్చాలనీ, కుమ్మరి కులానికి ప్రజాపతి పదాన్ని పర్యాయ పదంగా చేర్చాలనీ, రజక కులానికి దోబి పదాన్ని పర్యాయ పదంగా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. బుడబుక్కల కుల ప్రతినిధులు ఆవుల మహేష్, లక్ష్మణ్ రావు, మేర కులానికి ప్రతినిధులు సంగ వెంకట రాజం, రాయబారపు సంతోష్, కుమ్మరి కుల ప్రతినిధులు బాలకిషన్ ప్రజాపతి, పావని రవీందర్ ప్రజాపతి, రజక కుల ప్రతినిధులు కె. శ్రీలక్ష్మి, కె. మల్లేష్ కుమార్, చల్ల వీరేశం తదితరులు ప్రతినిధి బృందంలో ఉన్నారు. కార్యక్రమంలో కమిషన్ చైర్మెన్ జి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్ , తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు, డిప్యూటీ డైరెక్టర్ యు శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ జి సతీష్ కుమార్, రిసెర్చ్ ఆఫీసర్ లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.