క్రీడలకు బడ్జెట్ కేటాయింపు చరిత్రాత్మకం

Budget allocation for sports is historic– తెలంగాణ సీఎం, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కి కృతజ్ఞతలు 
– కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్
నవతెలంగాణ – దుబ్బాక రూరల్ 
క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చి బడ్జెట్ కేటాయింపులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి రూ.325 కోట్లు కేటాయించడం హర్షణీయమని కరాటే మాస్టర్ , బ్లాక్ బెల్ట్ థర్డ్ డాన్ యువ స్పోర్ట్స్ కరాటే అకాడమి ఫౌండర్ బూరాని శ్రీకాంత్ అన్నారు.శనివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో విలేఖర్లతో మాట్లాడారు. క్రీడారంగానికి మునుపెన్నడూ లేని విధంగా బడ్జెట్ కేటాయించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిలకు తాము ప్రత్యేక కృతజ్ఞతలు  తెలుపుతున్నానన్నారు.  రేపటి భావితరం యువత స్వామి వివేకానందుని బాటలో అడుగులు వేస్తూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడా సాంస్కృతిక రంగాల్లో ముందుండాలని సూచించారు.