
ప్రజా వ్యతిరేక కార్పోరేట్ అనుకూల కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్ అని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండగంగాధర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈనెల 10న చలో హైదరాబాద్ మహాధర్న విజయవంతం చేయాలి అని అన్నారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు కార్పొరేట్లకు అనుకూలంగా తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్ న్ని నిరసిస్తూ ఫిబ్రవరి 10న ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం ఉంది. దీనికి దళితులు విద్యార్థులు యువకులు కార్మికులు రైతులు మహిళలు పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నలవాల నరసయ్య పాల్గొన్నారు.