దోపిడీ వ్యవస్థ కూల్చివేతతో సమ సమాజ నిర్మాణం

నవతెలంగాణ -ఆలేరుటౌన్‌
దోపిడీ వ్యవస్థ కూల్చివేతతోనే సమ సమాజం నిర్మించబడుతుందని సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జనార్ధన్‌ అన్నారు. గురువారం ఆలేరు పట్టణంలో టీఎన్‌జీఓ భవనంలో ఇక్కిరి ధర్మన్న 18వ వర్థంతి నిర్వహించారు.ముందుగా భవనం ముందు అమర వీరుల స్మారక స్థూపం వద్ద జండాను డివిజన్‌ కార్యదర్శి బేజాడి కుమార్‌ ఎగురవేశాడు. ఈ కార్యక్రమంలో ఏ ఐ కే ఎం ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చిర బోయిన రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు బర్మ బాబు, జిల్లా నాయకులుపిన్నపు రెడ్డి రాఘవ రెడ్డి,పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.సీత, జిల్లా నాయకురాలు పద్మ శశిరేఖ, పీవైఎల్‌ జిల్లా అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్‌, ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్‌, తదితరులు పాల్గొన్నారు.
ధర్మన్న అమరత్వం చిరస్మరణీయం
ఆలేరురూరల్‌: పీడిత ప్రజల కోసం సమ సమాజ స్థాపనకు తన ప్రాణాలను అర్పించిన విప్లవోద్యమ ధర్మన్న అమరత్వం చిరస్మరణీయమని సీపీిఐ ఎంఎల్‌ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మామిడాల బిక్షపతి అన్నారు .ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో అఖిల భారత రైతుకులిసంఘం డివిజన్‌ అధ్యక్షులు టంగుటూరు గ్రామ సర్పంచ్‌ కామ్రేడ్‌ ఈక్కిరి ధర్మన్న 18వ వర్థంతి సభ జరిగింది. సభకు ముందు అమరుల స్థూపం వద్ద జెండా ఎగరవేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం పరితపించిన గొప్ప విప్లవ నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ కార్యదర్శి సహదేవ్‌ నాయకులు కళ్లెపు అడవయ్యా గడ్డం నాగరాజ్‌ ఈక్కిరి శ్రీనివాస్‌ మార్చోడు సిద్దేశ్వర్‌ టంగుటూరు సర్పంచ్‌ కట్టా సమరసింహారెడ్డి మామిడాల బాల మల్లేష్‌ ఎలగందుల సిద్దులు , కల్లెపు శంకర్‌ కొత్తపేట వీరమల్లు పంజాల మురళి శిఖలం కుమారస్వామి, మామిడాల ప్రవీణ్‌ ఇక్కిరి మధు కొత్తపేట బాలరాజ్‌ ఇక్కిరి సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.