ముమ్మరంగా పూజారుల భవన నిర్మాణ పనులు

– పరిశీలించిన ఎండోమెంట్ డి ఈ రమేష్ బాబు, ఈవో రాజేంద్రం 
నవతెలంగాణ -తాడ్వాయి 
ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరైన మేడారం జాతరలో పూజారులకు ఇబ్బందులు లేకుండా 1.50 లక్షల విలువ గల ప్రత్యేక భవనం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎండోమెంట్ డి ఈ సిహెచ్ రమేష్ బాబు, ఏ ఈ వీర చందర్రావు, ఈవో రాజేంద్రం లు గురువారం సందర్శించి పరిశీలించారు. పనులు నాణ్యతగా సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. భవనం నిర్మాణ పనులు, ప్రహరీ గోడ తదితర పనులను కూడా పరిశీలించారు. నిర్మాణ పనులను చూసి ఎండోమెంట్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. మేడారం మహా జాతరకు పూజారులకు జాతర సమయంలో నివాసము ఉండటానికి, ప్రత్యేక పూజలు చేసుకోవడానికి నిర్మిస్తున్నారు. దీంతో పూజారులకు జాతర సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పూజలు నిర్వహించుకోవడానికి ఉపయోగపడుతుంది.