పంచాయతీలకు భవనాలేవి?

నూతన జీపీలకు భవనాలు లేక అవస్థలు
ప్రైవేట్‌ గదులు పాఠశాల లలో గ్రామ సభలు సమావేశాలు
ఏళ్ళు గడుస్తున్నా పాటించుకొని పాలకులు
నవతెలంగాణ-పెద్దశంకరంపేట
ప్రభుత్వం 500ల జనాభా ఉన్న ప్రతి గ్రామాన్ని గిరిజన తాండలను గ్రామపంచాయతీలుగా మార్చింది. గ్రామ పంచాయతీలుగా మార్చి 5 సంవత్సరాలు అవుతున్నా నేటికీ పంచాయతీ కార్యాలయాలకు నూతన భవనాలు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజలు ఆరోపిస్తున్నారు. అద్దె భవనాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో, బీసీ కమ్యూనిటీ హాళ్లలో ఉంటూ ఎన్నో అవస్థలు పడాల్సి వస్తుందని వాపోతున్నారు.
పంచాయతీ భవనాలు కరువు
పెద్దశంకరంపేట మండలంలోని 22 గ్రామ పంచాయతీలు ఉండగా నూతనంగా మరో 5 పంచాయతీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది . దీంతో మండలంలో 27 గ్రామ పంచాయతీలు అయ్యాయి. ఇందులో కొన్ని పంచాయతీ భవనాలు శిథిలావస్తకు చేరాయి. మండలంలో నూతనంగా జామున నాయక్‌ తండా, ఇసుకపాయాతండా, గోపని వెంకటాపూర్‌, సంగారెడ్డి పేట, దానంపల్లి, పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ఈ జీపీలకు నూతన భవనాలు మంజూరు చేయక పోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా పాఠశాలల అదనపు గదులలో మరియు బీసీ కమ్యూనిటి హాలలో పాలన కొనసాగిస్తున్నారు.. దీంతో గ్రామ సభలు సమావేశాలు నిర్వహించేందుకు ఎన్నో ఇబందులు ఎదురురౌ వుతాన్నాయని వాపోతున్నారు. 5 సంవత్సరాలుగా పాఠశాలలు కమ్యూనిటి హాల్లో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగించారు. ఇప్పటికైనా పంచాయతీలకు నూతన భవనాలు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
గ్రామ సభకు తిప్పలు
గడ్డి రణెమ్మ దానంపల్లి సర్పంచ్‌
గ్రామం లో ఏర్పటైన గ్రామపంచాయతీ కార్యాలయం బీసీ కమ్యూనిటీ హాల్లో కొనసాగిస్తున్నాం. గ్రామ సభ నిర్వహించాలంటే స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నాం.
పురాతన భవనంలో కొనసాగిస్తునాం
మోతి బాయి జాముననాయక్‌ తండా సర్పంచ్‌
జామున నాయక్‌ తండాలో నూతనంగా ఏర్పాటు అయినా జిపి భవనం పురాతన పాఠశాల భవనంలో ప్రభుత్వ కార్యక్రమలు నిర్వహిస్తునాం. వర్షానికి ఎప్పుడు కులుతోందో తెలువదు. ఇప్పటికె రికార్డ్‌లపై దుమ్ము పడుతుంది.
ప్రతిపాదనలు పంపించాం
శ్రీనివాస్‌ పిఆర్‌ డిఈ అల్లాదుర్గం
ప్రతిపాదనలు పంపిచాము. నూతనంగా ఏర్పాటైన పంచాయతీలకు భవనాలు లేక ఇబ్బంది పడుతున్నా విషయం వాస్తవమే 7 పంచాయతీ లకు సంబదించి ఉన్నంతధికారులకు పంపిచాం అన్నారు మంజూరు కాగానే నిర్మాణం చెప్పడతామన్నారు.