నవతెలంగాణ-బంట్వారం
మండల కేంద్రానికి చెందిన పాలెపల్లి వజీర్ పాషా అనే రైతు తన ఎద్దు పొలంలో మేత మేయడానికి కట్టేశాడు. ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న ట్రాన్స్ ఫార్మర్‌కు తన కాలు తగిలి ఎద్దు మృత్యువాత చెందింది. ఎద్దును చూసి ఆ పేద రైతు కన్నీరుమున్నీరు అయ్యారు. చనిపోయిన ఎద్దు విలువ రూ.75 వేల ఉంటుందని అర్థికంగా ఆ రైతును ఆదుకోవాలని ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని, గ్రామస్తులు కోరారు.