తెలంగాణలో బుల్డోజర్‌ పాలన నడుస్తోంది

– మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ లో బుల్డోజర్‌ పాలన నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. బుల్డోజర్‌ విధానం ఉండొద్దన్న సుప్రీంకోర్టు ఆర్డర్స్‌ తెలంగాణకు వర్తించవా? అని ప్రశ్నించారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కూల్చివేతలతో పేదలను రోడ్లపై పడేయడం న్యాయం కాదన్నారు. ఈ విషయంలో ప్రత్యమ్నాయాలపై ఆలోచన చేయాలని సూచించారు. ప్రజలు కట్టుకున్న చోట వారికి ఇండ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాటించుకోక పోతే కేంద్రం ఈ అంశంపై ఫోకస్‌ చేయాలని కోరారు. మొత్తం బుల్డోజర్‌ వ్యవస్థను రద్దు చేయాలన్నారు.