బుల్లెట్‌ రిలీజ్‌కి రెడీ

బుల్లెట్‌ రిలీజ్‌కి రెడీశ్రీ బండి సదానంద్‌ అండ్‌ మెమరీ మేకర్స్‌ సోమిసెట్టి హరికష్ణ సమర్పించు, తుమ్మూరు కోట ఫిలిం సర్క్యూట్‌ బ్యానర్‌ పై నిర్మించిన చిత్రం ‘బుల్లెట్‌’. చౌడప్ప దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో రవి వర్మ, సంజనా సింగ్‌, ఆలోక్‌ జైన్‌ ,మనీషా దేవ్‌, జీవ, విజయ రంగరాజు, సంధ్య శ్రీ, నర్సింగ్‌ యాదవ్‌, జబర్దస్త్‌ అప్పారావు ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 8న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రొడ్యూసర్‌ ఏ.ఎం రత్నం, దర్శకులు వి సముద్ర ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.హీరో రవి వర్మ మాట్లాడుతూ, ”హీరోగా నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ థియేటర్లో ఈ చిత్రాన్ని చూడాలని కోరుకుంటున్నా. ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది’ అని చెప్పారు. ‘ఇదొక యాక్షన్‌ మూవీ. కర్నూల్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని చిత్రీకరించాం. టెక్నీషియన్స్‌ అందరూ బెస్ట్‌ అవుట్‌ పుట్‌ ఇచ్చారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. హీరో రవి వర్మ కొత్తవాడైనా చాలా బాగా చేశాడు’ అని దర్శకుడు చౌడప్ప అన్నారు. బండి సదానంద్‌ మాట్లాడుతూ, ‘టీం వర్క్‌తో చేసిన చిత్రమిది. యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో ఉన్నాయి. కచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాం’ అని అన్నారు.