నాగారంలో ఘనంగా కట్ట మైసమ్మ ప్రతిష్టాపన వేడుకలు

నవతెలంగాణ – యైటింక్లయిన్ కాలనీ: మంథని మండలం నాగారం గ్రామంలో కట్ట మైసమ్మ ప్రతిష్టాపన వేడుకలు 2 రోజుల నిర్వహణ అనంతరం శుక్రవారం  ఘనంగా ముగిసాయి. వేద పండితుడు ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫిబ్రవరి 6న గ్రామ దేవతల ఊరేగింపు జలాధివాసం, 7న ధాన్య, ఫలాది, పుష్పాది  వాసం నిర్వహించి  వేదమంత్రాలతో నవగ్రహాలకు హోమం, పూర్ణాహుతి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మైసమ్మ అమ్మవారిని ప్రతిష్టించారు. కార్యక్రమ నిర్వాహకుడు ఎరుకల రాజశేఖర్   మాట్లాడుతూ 2  రోజుల కార్యక్రమం విజయవంతం అవడంలో గ్రామస్తుల భాగస్వామ్యం ఎంతో ఉందని అన్నారు.గ్రామ ప్రజలు,రైతుల బాగుకోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన అన్ని కుల సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు.