ఆదిలాబాద్ లో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం..

Bandi Sanjay effigy burnt in Adilabad..నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
రాజ్యాంగాన్ని సవరించే కుట్రల్లో భాగమే దళితులు, దళిత మేధావులు, బహుజనులపై బీజేపీ నాయకులు దాడులతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేష్ ఆరోపించారు. యుద్ధనౌక గద్దర్ పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తు మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆయన చిత్రపటాన్ని దహనం చేశారు. బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు క్షమాపణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొప్పుల రమేష్ మాట్లాడుతూ.. యుద్ధనౌక గద్దర్ కు పద్మశ్రీ అవార్డు ఇవ్వమని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గద్దర్ కు పద్మశ్రీ ఇవ్వమని తాము అడిగామని ప్రశ్నించారు. రాష్ట్రంలో మంచి సేవలు అందించిన వారి పేర్లను ప్రభుత్వం ప్రతిపాధించిందన్నారు. అందులో గద్దర్ పేరు కూడా ఉందన్నారు. దళితులు, బహుజనులపై దాడి జరిగిన సమయంలో కాలికి కజ్జలు కట్టి ప్రజలను చైతన్యవంతులు చేశారన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాడిన పాటలు ప్రజలను రాష్ట్రం సాధించేందుకు ఏకం చేసిందన్నారు. ఇవ్వని వదిలి గద్దర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పార్లమెంట్ అమిత్ షా అంబేద్కర్ ను కించ పరిచేలా మాట్లాడారని. ఇప్పుడు గద్దర్ పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఇది మొత్తం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రల్లో భాగమేనని తాము భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం నాయకులు మేకల మల్లన్న, సుధీర్, రాఘవేంద్ర, నరేందర్, రఘు, లక్ష్మణ్, సుభాష్, స్వామి, సంటి రవి పాల్గొన్నారు.