నవతెలంగాణ – నవీపేట్
అప్పు తీర్చేందుకు చిట్టి లేపి తీసుకొచ్చిన నాలుగు లక్షల సొమ్ము అపహరణకు గురైన సంఘటన నవీపేట్ మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవీపేట్ మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన సయ్యద్ మీర్ బీడీ కంపెనీలో పనిచేస్తున్నాడు. తనకున్న 4 లక్షల అప్పును తీర్చడం కోసం చిట్టి లేపి డబ్బులు తీసుకువచ్చి బీరువాలో దాచాడు. తమ దగ్గర బంధువులను పరమాశించేందుకు శనివారం కుటుంబ సభ్యులంతా కలిసి నందిపేట్ కు వెళ్లి సోమవారం ఇంటికి రాగా తలుపులు పగులగొట్టి బీరువా తెరిచి ఉండడంతో చూడగా 4 లక్షల రూపాయలు దొంగతనానికి గురైనట్లు తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు ఎస్ఐ యాదగిరి గౌడ్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ క్లూస్ టీంతో సంఘటన స్థలానికి వచ్చి ఆధారాల కోసం పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపారు. కాగా ఈ మధ్యకాలంలో దొంగతనాలు తరచూ జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.