తాళం వేసిన ఇంట్లో పట్టపగలే చోరీ

తాళం వేసిన ఇంట్లో పట్టపగలే చోరీనవతెలంగాణ-లోకేశ్వరం
తాళం వేసిన ఇంట్లో పట్ట పగలే చోరీ జరిగిన సంఘటన లోకేశ్వరం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏఎస్సై దిగంబర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గడ్‌చాంద గ్రామానికి చెందిన అంబకంటి లావణ్య, ఆదివారం ముధోల్‌ సాంఘీక సంక్షేమ పాఠశాలలో 5వ తరగతి చదువుకుంటున్న కుమారుని వద్దకు వెళ్లింది. ఆదివారం ఉదయం 11:30గంటలకు ఇంట్లో నుంచి బయలు దేరి సాయంత్రం 6గంటలకు తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి, ఇంట్లోని బీరువా తాళం పగలగొట్టి ఉంది. దీంతో చోరీ జరిగినట్టు గుర్తించింది. 35 గ్రాముల బంగారం, రూ.20వేల నగదు చోరీ అయినట్టు తెలిపింది. మొత్తం నగదు, బంగారం విలువ రూ.లక్షా 50వేల 500లను దొంగలు దోచుకెళ్లినట్టు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై దిగంబర్‌ తెలిపారు. ఘటన స్థలానికి చేసుకున్న పోలీసులు పోరెన్సిక్‌ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వేలి ముద్రలను సేకరించారు. పోలీసులు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.