నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిందని ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగాధర్ ఆదివారం తెలిపారు. ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని బాబన్ సాహడ్ పహేడు కు చెందిన షేక్ అబ్బుత్ ఆలిక్, అతని భార్య ముస్కాన్ బేగం కలిసి మూడు రోజుల క్రితం వారి తల్లి ఇంటికి వెళ్లినట్టు తెలిపారు. ఈ మేరకు షేక్ అబ్బుత్ ఆలిక్ శనివారం రాత్రి ఇంటికి తాళం వేసుకొని గణపతి మండపం అలంకరణ కోసం వెళ్లినట్లు తెలిపారు. అయితే తిరిగి ఉదయం 6 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు పగలగొట్టి ఉంది. గుర్తుతెలియని దొంగలు ఇంట్లో చొరబడి బీరువా పగలగొట్టి అందులో ఉన్న రెండు తులాల బంగారం, రూ 50 వేల నగదు అపహరించినట్లు పేర్కొన్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగాధర్ తెలియజేశారు.