తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

నవతెలంగాణ – జమ్మికుంట
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటన జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ వరగంటి రవి తెలిపిన వివరాల ప్రకారం హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన భోగం లక్ష్మి ఈనెల 18న తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్ళింది. వెళ్లే ముందు తన ఇంటి దగ్గరే ఉన్న తన కూతురిని అప్పుడప్పుడు ఇంటి వైపు చూడమని తెలుపగా, ఫిర్యాది కూతురు లక్ష్మి మంగళవారం ఇంటికి వెళ్లి చూడగా ,తాళం తాళం పగలగొట్టి ఉండడం చూసి, తల్లి భోగం లక్ష్మికి  తెలుపగానే  వచ్చి చూడగా, తొమ్మిది వేల నగదు, 1100 రూపాయల వెండి వస్తువులు పోయినాయని భోగం లక్ష్మి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు.