తాళం వేసిన ఇంట్లో చోరీ

– 37 తులాల బంగారం ఆభరణాలు, నగదు అపహరణ
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలో తాళం వేసిన ఇంట్లో దొంగల పడి 37 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదును అపారించినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి పట్టణంలోని పీఎంహెచ్ కాలనీలో నివసించే అర్నె యోగేష్ అనే వ్యక్తి అతని కుటుంబంతో సహా తేదీ 21-10-2024 నా ఉదయం 9:30 సమయంలో ఇంటికి తాళం వేసి, వరంగల్ వెళ్ళినారనీ, నిన్న తేది 22-10-2024 నాటి సాయంత్రం 6:30 గంటలకు వారికి తెలిసిన బంధువుల ద్వారా, వారింటి తలుపులు తెరిచి ఉన్నాయని తెలియగా, వారు రాత్రికి వచ్చి చూసుకునేసరికి, ఇంటి యొక్క తాళాలు పగలగొట్టబడి ఉండగా, అట్టి విషయాన్ని బుధవారం ఉదయం సమయంలో పోలీసులకు తెలియజేసి, ఇంటిలో ఉన్న దాదాపు 37 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు దొంగతనం కాబడినాయని దరఖాస్తు ఇవ్వగా, కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇట్టి సంఘటన స్థలానికి కామారెడ్డి ఎస్డిపిఓ నాగేశ్వరరావు , సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ , సిసిఎస్ సిబ్బంది, కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది వచ్చి పరిశీలన చేసి, చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను, పాత నేరస్తుల గురించి మూడు బృందాలుగా విడిపోయి నేరస్తుని పట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేయడం జరుగుతుందనీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ముఖ్య విన్నపం ఏమనగా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి వేసిన తాళము, గేటుకు వేసిన తాళము బయటకు కనపడే విధంగా కాకుండా, కనబడకుండావేరొక సైడు వేయలని, విలువైన ఆభరణాలు, నగదును లాకర్లలో భద్రపరుచుకోవాల్సిందిగా కోరడం జరుగుతుందన్నారు.